
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
అరసవల్లి: ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ సర్కిల్ ఉద్యోగులు, కార్మికులు సోమవారం నిర్వహించిన శాంతియుత ర్యాలీ విజయవంతమైంది. విద్యుత్ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్ పంపిణీ సంస్థల యాజమాన్యాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాల యం వరకు వందలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు కదం తొక్కారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎంవీ గోపాలరా వు(గోపి), కన్వీనరు జి.రమేష్‌కుమార్, కో చైర్మన్లు ఎంవీ అప్పలనాయుడు, బీవీ గురునాథరావు, పీవీ రమణ, ఎం.శ్రీను, ఎస్.వెంకటరావు, సుబ్రహ్మణ్యం తదితరులు నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.