
కొత్తూరు ఎస్‌ఐపై ఎస్పీకి ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : భూమి ఇవ్వకుంటే ప్రాణాలు తీసేస్తామంటూ తమ కోడలు, ఆమె తరపు బంధువులు తమను బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని ఓ వృద్ధురాలు ఎస్పీ మహేశ్వరరెడ్డిని వేడుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు బాధితుల నుంచి 63 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కొత్తూరు మండలం దాశరథీపురానికి చెందిన తొత్తడి జయమ్మ దివ్యాంగుడైన తన కుమారుడు సింహాచలంతో కలిసి ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా తన కుమారుడికి, కోడలికి విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో భూ వివాదాలు జరిగాయని, గత నెల 15న తమ ఇంటికొచ్చి తన కుమారుడిపై దాడి చేయడమే కాకుండా తిరిగి కేసు పె ట్టారని ఆమె పేర్కొన్నారు. కొత్తూరు ఎస్‌ఐ కౌంటర్ ఎఫ్‌ఐఆర్‌లో తమ సంతకాలు తీసుకుని తా ము చెప్పిన ఫిర్యాదులో నిజానిజాలు రాయకుండా తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, దీనిపై విచారణ జరపాలని ఆమె పేర్కొన్నారు. అలాగే టెక్కలి పంచాయతీ కార్యాలయంలో స్వీపరుగా పనిచేస్తున్న పడాల శ్రీను తాను ఫేస్‌బుక్‌లో స్కూ టీ అమ్మకం ప్రకటన చూసి మోసపోయానని, రూ.30వేలు తీసుకుని స్కూటీ ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదు చేశారు.