
ముగిసిన తపాలా ఉద్యోగ సంఘాల మహాసభలు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం డివిజన్ తపాలా ఉద్యోగ అనుబంధ సంఘాల 12వ ద్వైవార్షిక మహాసభలను యూటీఎఫ్ కార్యాలయంలో గ్రూప్–సీ అధ్యక్షులు యు.వి.రమణ, పోస్టుమేన్– ఎం.టి.ఎస్ అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్‌ఎఫ్‌పీఈ సంఘ నాయకులు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌పీఈ రాష్ట్ర కన్వీనర్ బి.శ్రీధర్ బాబు, పోస్టుమేన్, ఎం.టి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.మురళి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, విశాఖట్నం పోస్టల్ రీజియన్ రాష్ట్ర నాయకులు కొండబాబు, రుద్రప్రతాప్, రామానందం, కిరణ్ కుమార్, పెంటపాపయ్య, నందికేశ్వరరావు, కస్తూరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సి అధ్యక్ష కార్యదర్శులుగా యు.వి.రమణ, కె.గణపతి, కోశాధికారిగా వి.డిల్లేశ్వరరావు, పోస్టుమేన్–ఎంటీఎస్ అధ్యక్ష కార్యదర్శులుగా టి.వెంకటేశ్వర్లు, ఎల్.బాబూరావు, కోశాధికారిగా ఎం.చిన్నారావు, ఇతర కార్యవర్గ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.