
ప్రొటోకాల్ రగడ
అరసవల్లి:
జిల్లా పరిషత్ చరిత్రలో తొలిసారిగా సర్వసభ్య సమావేశంలో అధ్యక్షురాలితో సహా సభ్యులంతా వాకౌట్ చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ సీపీకి చెందిన శాసన మండలి సభ్యు డు పాలవలస విక్రాంత్‌ను ఇటీవల పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాకుండా నిలువరించడమే కాకుండా భౌతిక దాడికి సైతం పాల్పడిన సంగతి విదితమే. దీనిపై ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ నెల 16న పాలకొండలో జరిగిన ఈ ఘటనకు బాధ్యుడైన పాలకొండ ఎంపీడీఓపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి జెడ్పీటీసీ సభ్యులపై అమానుషంగా ఏకవచనంతో మాట్లాడిన జెడ్పీ సీఈఓ ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజాపై విచారణకు ఆదేశించాలని సభ్యులంతా పట్టుపట్టడంతో సభ హీటెక్కింది. అనంతరం సీఈఓ తీరును నిరసిస్తూ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, పాలకొండ సబ్‌కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రాజా తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓపై ధ్వజం
ఎమ్మెల్సీ విక్రాంత్‌కు జరిగిన అవమానంపై జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు స్పందిస్తూ ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా ఎంపీడీఓపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా బదులిస్తూ కమిషనర్‌కు నివే దించానని, తదనంతరం చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ క్రమంలో ‘నేను చెప్పింది విను ముందు’ అనడం సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్‌ను ఏకవచనంతో పిలవడమేంటని పోడియంను చుట్టుముట్టారు. జెడ్పీ చైర్ పర్సన్ కూడా జత కలిశారు. పాలకొండ ఎంపీడీఓపై చర్య లు తీసుకునేంత వరకు సభ జరగదని అంతా వాకౌ ట్ చేశారు. సభలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, హిరమండలం టీడీపీ జెడ్పీటిసీ బుచ్చిబా బు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్‌లు మాత్ర మే కూర్చుండిపోయారు. అనంతరం సభ వాయి దా పడిందని జెడ్పీ సీఈఓ ప్రకటించారు.
సభలో ఆందోళన
● టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న చట్టసభ్యులందరికీ గౌరవంగా ప్రోటో కాల్ పాటించామని గుర్తుచేశారు. గతంలో ఆహ్వానాలు పంపినా అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు ఏనాడూ రాలేదన్నారు.
● వంగర ఎంపీపీ సురేష్ ముఖర్జీ మాట్లాడుతూ ఎమ్మెల్సీకి సమావేశానికి ఆహ్వానించి మళ్లీ వెనక్కి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
● ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ చట్టసభ్యులనే లోపలికి రానివ్వని సంస్కృతి దారుణమన్నారు.
● జి.సిగడాం జెడ్పీటీసీ కాయల వెంకట రమణ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు.
● రాజాం జెడ్పీటీసీ నర్సింహులు, బూర్జ జెడ్పీటీసీ రామారావు, రణస్థలం జెడ్పీటీసీ టి.సీతారాం, వీరఘట్టం జెడ్పీటీసీ జె.కన్నతల్లి, సీతంపేట జెడ్పీటీసీ ఆదినారాయణ, సంతబొమ్మాళి జెడ్పీటీసీ వసంత్‌రెడ్డి మాట్లాడుతూ విక్రాంత్‌కు జరి గిన అవమానం తట్టుకోలేకపోతున్నామన్నారు.
నన్ను దారుణంగా అవమానించారు
ఈ నెల 16న పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం మేరకే వెళ్లాను. కానీ నన్ను లోపలకు వెళ్లనివ్వలేదు. నాకు ఆప్షనల్ నియోజకవర్గమైన పాలకొండలో మండల సమావేశానికి రా కుండా ముఖద్వారం వద్దనే ఆపేశారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు భౌతికంగా తోసేశారు. నన్ను దా రుణంగా అవమానపరిచారు. ఆహ్వానం పంపిన ఎంపీడీఓను వివరణ అడిగితే ‘అవగాహన లేక పని ఒత్తిడిలో చూసుకోక ఆహ్వానం పంపించాం.. ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నామంటూ.’ లేఖలో సమాధానం ఇచ్చారు. ఒక ఎమ్మెల్సీగా నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే జెడ్పీటీసీలు, ఎంపీపీల పరిస్థితి ఏంటి. ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా పాలకొండ ఎంపీడీఓపై ఎందుకు చర్య లు తీసుకోలేదు. జెడ్పీ సీఈఓపైనా విచారణ జరగాలి.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ
నన్నే చాలాసార్లు పిలవలేదు
చట్ట సభ్యులను కూడా అవమానించడం దారుణం. ఇటీవల ఇచ్ఛాపురంలో జిల్లా పరిషత్ నిధులతో ఆర్‌డబ్ల్యూఎస్ పథకాల ప్రారంభోత్సవానికి నాకు కనీసం సమాచారమైనా ఇవ్వలేదు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నాకు కాకపోయినా ఈ చైర్‌కు అయినా విలువ ఇవ్వాలి కదా. – పిరియా విజయ, జెడ్పీ చైర్‌పర్సన్
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు అవమానంపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీవ్ర చర్చ
పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకున్నాకే సమావేశమంటూ ప్రకటించిన జెడ్పీ చైర్‌పర్సన్ విజయ
ఎమ్మెల్సీకి మద్దతుగా సభ్యుల వాకౌట్
జెడ్పీ సీఈఓ పాత్రపై కూడా విచారణ జరిపించాలన్న ఎమ్మెల్సీ విక్రాంత్
ప్రొటోకాల్ పాటించాలి..
జిల్లాలో అన్ని శాఖల అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలి. ప్రొటోకాల్ పాటించాలి. ఈ విషయంలో అనుమానాలు ఉంటే జిల్లా రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. ఇచ్ఛాపురం ప్రొటోకాల్ ఉల్లంఘన నా దృష్టికి వచ్చింది. ఇలాంటివి మళ్లీ జరగకూడదు. పాలకొండ అంశంపై జెడ్పీ సీఈఓ విచారణ జరపాలి. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కలెక్టర్

ప్రొటోకాల్ రగడ

ప్రొటోకాల్ రగడ

ప్రొటోకాల్ రగడ