కూటమి కన్ను | - | Sakshi
Sakshi News home page

కూటమి కన్ను

Sep 22 2025 6:07 AM | Updated on Sep 22 2025 6:11 AM

● పేదింటి పట్టాపై

● వైఎస్సార్‌సీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు తిరిగి తీసుకునేందుకు కుయుక్తులు

● వాటిని కొత్తగా కూటమి నాయకులకు ఇచ్చే ప్రయత్నం

● జిల్లాలో దాదాపు 2867 మంది లబ్ధిదారులకు నష్టం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పేదవాడి ఇంటి పట్టాపై కూటమి కన్ను పడింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటిపోయినా ఒక్క ఇంటినైనా మంజూరు చేయని ప్రభుత్వం.. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా లు తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పేదల ఇళ్లపై ఓ నిర్ణయం తీసుకు న్నారు. గత ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా తీసుకుని, నిధులు మంజూరై నిర్మాణం ప్రారంభించకపోతే ఆ ఇల్లు రద్దు చేయాలని, ఆ పట్టాను కొత్తవారికి ఇవ్వాలని ఆదేశించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు నష్టం చేకూర్చనుండగా.. కూటమి నాయకులకు మాత్రం లాభం తీసుకురానుంది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం ప్రారంభం కాకపోతే వారికి ఆర్థికంగా సాయం చేసి ఇంటిని పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చిన పట్టాలను వెనక్కి లాక్కోవాలనుకోవడంపై సామాన్యు లు మండిపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకునే ప్రయ త్నం చేస్తుంటే వారికి నిధులు మంజూరు చేయకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి పట్టాలను రద్దు చేయడం దుస్సాహసమేనని అంటున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ హయాంలో..

గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వేలు నిర్వహించి, అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు మంజూరు చేశారు. స్థలం ఉన్న వారికి వారి స్థలంలో ఇంటి నిర్మాణం చేసేందుకు సా యం చేశారు. సొంత స్థలం లేని పేదలకు ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి, వారికి పట్టాలను అందజేశారు. ఇళ్ల నిర్మాణాలు కూడా గత ప్రభుత్వ మే చేపట్టింది. గత ప్రభుత్వం హయాంలో జిల్లాలో 30 మండలాలు, నాలుగు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 80,691 ఇళ్లను మంజూరు చేసింది. ఇందుకు గాను 834 లే అవుట్లను ఏర్పా టు చేసింది. ఆ లే అవుట్లలో విద్యుత్‌, తాగునీటి సదుపాయాలు కల్పించారు. స్థలమిచ్చి జిల్లాలో 33,123 ఇళ్లను మంజూరు చేసి వారికి శాశ్వత చిరునామా ఇచ్చారు. వారిలో చాలామంది ఇళ్ల ప్రవేశాలు కూడా పూర్తి చేశారు. కొందరు మాత్రం ఇళ్లను ప్రారంభించుకోలేకపోయారు. ఇలాంటి వారు జిల్లాలో 2867 మంది ఉన్నారు. ఇప్పుడు వీరి పట్టాలు ప్రమాదంలో పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement