
శతాబ్ది ఉత్సవం.. ఎనలేని ఉత్సాహం
● రేపటి నుంచి మూడు రోజుల పాటు కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు
● లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం
టెక్కలి: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కోటబొ మ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి గు రువారం వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లా నాయకులు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్ర త్యేక పర్యవేక్షణలో దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేశా రు. అమ్మవారి దర్శనానికి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వివిధ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఉత్సవాల్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొట్టమొద టి సారిగా హెలికాప్ట ర్ రైడింగ్, అమ్మ వారి చరిత్ర తెలిపే లేజర్ షో కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. మొదటి రోజు సంగిడి పోటీలు, 24వ తేదీన ఉలవల బ స్తాలు ఎత్తే పోటీలు, అమ్మవారి శోభా యాత్ర, లేజర్ షో, 25న భారీ ఎత్తున మందుగుండు సామగ్రి కాల్చడం, శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర, మెగా డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నారు. వీటితో పాటు మూ డు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి.

శతాబ్ది ఉత్సవం.. ఎనలేని ఉత్సాహం