
‘నిరసన కొనసాగిస్తాం’
అరసవల్లి: న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఈ మేరకు యాజమాన్యం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే తమ జేఏసీ తరఫున నిరసన కొనసాగిస్తామని విద్యుత్ ఉద్యోగ కార్మికులంతా స్పష్టం చేశారు. శనివా రం కూడా విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులంతా దీక్ష చేపట్టారు. అయితే ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు పాల్గొనడం చర్చనీయాంశమైంది. తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని దీక్షలో కూర్చున్న మహిళా ఉద్యోగులు ప్రకటించడంపై సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. 22న విద్యుత్ సర్కిల్ కార్యా లయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపడతామని తెలిపారు.