
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
ఇచ్ఛాపురం :అప్పుల బాధ భరించలేక ఇచ్ఛాపురంలోని 17వ వార్డు సంతపేటకు చెందిన కర్రి నాగరాజు(42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగరాజు గతంలో లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహించేవాడు. వ్యాపారంలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోవడంతో లారీలు అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మనస్థాపానికి గురై శుక్రవారం తన ఇంటి మేడపైన గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజుకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.