
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి ఎన్.వై.నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.నూకరాజు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా 7వ మహాసభలు శుక్రవారం శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో నిర్వహించారు. మున్సిపల్ రంగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించి మరణించిన జి.సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, 12వ పీఆర్‌సీ అమలు చేయాలని, సమ్మెకాలపు జీతం చెల్లించేలా జీఓ జారీచేయాలని, జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా పి.తేజేశ్వరరావు, అధ్యక్షుడిగా డి.యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్.బలరాం, ఉపాధ్యక్షులుగా రమేష్ పట్నాయక్, ఎ.గణేష్, సహాయ కార్యదర్శులుగా మురుగన్, పి.ఢిల్లీ, కోశాధికారిగా టి.సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎ.శంకర్ గణేష్, ఎ.మోహన్, కమిటీ మెంబర్లుగా ఎ.దేవసంతోష్, ఎ.రాజేష్, బి.సరోజ, ఎ.రాజేశ్వరి, జె.మాధవి, హరీష్, తారక, రాజేష్, భాస్కర్, కె.రవి, కె.రాజేశ్వరి, ఎ.రాము, ఎం.రాఘవ, ఎ.జ్యోతిప్రసాద్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.