
ఉత్సాహంగా సబ్ జూనియర్స్ సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో జయకేతనం ఎగురవేసి జిల్లా కీర్తిప్రతిష్టతలను చాటిచెప్పాలని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు ఆకాంక్షించారు. జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు శుక్రవారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి రికార్డుస్థాయిలో 300 మంది వరకు బాలబాలికలు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని కె.డి.పాలెం వేదికగా అక్టోబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ఏపీ రాష్ట్రస్థాయి బాలబాలికల సబ్–జూనియర్స్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్–2025 పోటీలు జరగనున్నాయని సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి, పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ తెలిపారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, జిల్లా ముఖ్య సలహాదారు పి.సుందరరావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బి.వి.రమణ, కె.మాధవరావు, ఉపాధ్యక్షులు మెట్ట తిరుపతిరావు, బొడ్డేపల్లి సురేష్‌కుమార్, ఎం.ఆనంద్ కిరణ్, అన్నెపు రాజగోపాల్, ఎ.డిల్లేశ్వరరావు, పెంటయ్య, పి.రమేష్, ఎస్వీ రమణ, మహంతి, మల్లేశ్వరరావు, తోటారావు, మోహనబాబు, ఐ.గౌరి, వెంకటరమణ, నాగు, హరికృష్ణ, అఖిల్, పీడీ పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.