
కన్నబాబుకు మాజీ స్పీకర్ తమ్మినేని పరామర్శ
ఆమదాలవలస: మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం సోమవారం కాకినాడలోని కన్నబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మృతితో కుటుంబానికి మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాలకు కూడా తీరని లోటు ఏర్పడిందన్నారు. పరామర్శలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ, పార్టీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, రాష్ట్ర ఇంటిలెక్చువల్ కార్యదర్శి రామకృష్ణరావు, జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి, బూర్జ ఎంపీపీ కర్నేన నాగేశ్వరరావు, బూర్జ జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, టెక్కలి వైఎస్సార్‌సీపీ నాయకులు, న్యాయవాది సింగుపురం మోహనరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముత్తా విజయ్, బొడ్డేపల్లి నారాయణరావు, జల్లు బలరాం నాయుడు, చింతాడ సూర్యనారాయణ, గుమ్మడి రాంబాబు, పొందూరు మండల నాయకులు పప్పల రమేష్, మామిడి కిరణ్, మామిడి శ్రీను, బెండి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.