
●తల్లికి వందనం పథకం వర్తించక అర్హుల అవస్థలు ●కొర్రీలు,
శ్రీకాకుళం న్యూకాలనీ:
తల్లికి వందనం పథకం అందక అనేక మంది తల్లులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాము తప్పులు చేయకపోయినా అనర్హత పేరిట పథకానికి దూరంగా ఉంచడంపై మండిపడుతున్నారు. అసలు.. ఇచ్చే మనసు లేనప్పుడు పథకం ఎందుకు ప్రకటించాలని.. తమను ఎందుకు ఇంతలా మోసం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పాలకులకు తగిన సమయంలో బుద్ధి చెబుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిల్లలు చనిపోయారని, తల్లి చనిపోయిందని, మీపేరిట కార్లు, మిల్లులు ఉన్నాయని, 70 విద్యుత్ మీటర్లు ఉన్నాయని, 10 ఎకరాల భూమి ఉందని, ఉచిత విద్యాహక్కు చట్టం ద్వారా చదువుతున్నారని.. ఇలా ఒకటేంటి ? లెక్కకు మించిన తప్పులు, దోషాలతో తల్లికి వందనం పథకం వర్తించక జిల్లా వ్యాప్తంగా బాధితులు నిరాశలో కూరుకుపోయారు.
ఆందోళన వద్దు..