
రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు
కొత్తూరు: కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలోని వంశధార నదిలో బలద ఇసుక ర్యాంపు పేరుతో నిర్వహిస్తున్న ర్యాంపులో అక్రమ తవ్వకా లు అరికట్టాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఇసుక ర్యాంపుతో పాటు స్టాక్ పాయింట్‌ను పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ఆదివారం పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న దారి లో ఆమె ప్రయాణించి ర్యాంపు వరకు చేరుకుని తవ్వకాలు పరిశీలించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కనుసన్నల్లోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని, ఒడిశాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక కోసం నదికి అడ్డంగా గట్టు కట్టడం దారుణమని, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాలతో సుమారు మూడు మీటర్ల లోతులో తవ్వ కాలు చేస్తే.. వరదలు వచ్చినప్పడు వసప, కుంటిబద్ర కాలనీ, నివగాంతో పాటు పలు గ్రామాలు మునిగిపోతాయని తెలిపారు. పొలాల మీదుగా ఈ ర్యాంపునకు దారి వేశారని, దీని వల్ల పంటలు తీసుకువచ్చే రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. దీనిపై ప్రశ్నిస్తున్న వారిని బెదిరిస్తున్నారని రెడ్డి శాంతి తెలిపారు. తవ్వకాలు ఆపకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబునల్‌కు (ఎన్‌జీటి)కు ఫిర్యాదు చేస్తానన్నారు. ర్యాంపు వద్దకు రెడ్డి శాంతి వచ్చారన్న విష యం తెలియడంతో స్థానిక రైతులంతా ఆమె వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు.
నిర్వాహకులను అడిగితే కేసులు పెడతామని భయపెడుతున్నారని కామయ్య జగదీష్, చినరాయుడుతో పాటు పలువురు రైతులు రెడ్డి శాంతికి వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సవర సావిత్రి, జెడ్పీటీసీ కామక భాగ్యవతి, మండల పార్టీ అధ్యక్షుడు గండివలస ఆనందరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ పాతపట్నం నియోజవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు అగతమూడి నాగేశ్వరరావు, జగదీ ష్, సర్పంచ్‌లు ధర్మారావు, బాలకృష్ణ, సాధుబాబు, వైకుంటరావు, సేపాన అశోక్ కుమార్, సింహాద్రి, ఎంపీటీసీ వనుము లక్ష్మినారాయణ, ఎ.నాగేశ్వరరావు రమేష్, నగేష్, యతిరాజు, నాగరాజు, ఆఫీస్, వాసు, అశోక్, లింగం పాల్గొన్నారు.
అక్రమ ఇసుక తవ్వకాలు అరికట్టాల్సిందే
మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
వంశధారలో అక్రమ ఇసుక తవ్వకాల పరిశీలన