
డీజే మోత.. పెడితే వాత
తీర్మానం చేసుకున్నాం
గ్రామంలో ఎవరూ డీజేలు పెట్టకూడదని రామ మందిరంలో తీర్మానం చేసుకున్నాం. పెద్దల మాట కాదని ఎవరైనా డీజేలు పెడితే ఆ బాధ్యత ఆ శుభకార్యం చేసిన వారిదే.
– కుమరాపు రమేష్‌నాయుడు, ఎంపీటీసీ, డీఆర్‌వలస
పెద్దల ఆలోచన మేరకే..
గుండె జబ్బులు, ఇతర వ్యాధుల తో బాధపడుతున్న వారిని దృష్టి లోఉంచుకుని గ్రామ పెద్దల ఆలో చన మేరకు ఈ నిర్ణయం తీసుకు న్నాం. శుభకార్యక్రమాలకు డీజే బదులుగా బ్యాండులు, ఇతర మేళాలు ఏర్పాటు చేసుకోవాలి. – కుమరాపు శ్రీనివాసరావు, సర్పంచ్, డీఆర్‌వలస
●
● డీఆర్‌వలసలో డీజేలు పెట్టకూడదని తీర్మానం
● శుభ కార్యక్రమాలకు డీజేలు పెడితే జరిమానా
జి.సిగడాం:
ఊరిలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా డీజేలు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. పుట్టిన రోజు నుంచి షష్టి పూర్తి వరకు అన్నింటా డీజే బీట్లు వినిపిస్తున్నాయి. కానీ జి.సిగడాం మండలంలోని దాలెమ్మ రాజువలస(డీఆర్ వలస) డీజేలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ ఇకపై డీజేలు వాడకూడదని వారు ఏకంగా దేవుడి గుడిలో ఈ నెల 20న అంతా కలిసి తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానాన్ని మీరి ఎవరైనా డీజే ఏర్పాటు చేస్తే జరిమానా విధించడంతో పాటు పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు.
ఎందుకు వద్దంటే..
డీజేల మోతతో గుండె జబ్బులు, ఇతర సమస్యలు ఉన్న వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. డీజేలు పెట్టినప్పుడు ఇంటిలోఉన్న సామాన్లు కూడా చిందరవందరగా మారుతున్నాయని, ఇది ప్రా ణాంతకంగా మారుతోందని వారంటున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే డీజీలు వాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

డీజే మోత.. పెడితే వాత

డీజే మోత.. పెడితే వాత

డీజే మోత.. పెడితే వాత