చిమ్మచీకటిలో... మనుషుల అలికిడి లేని చోట.. కేకలు వేస్తే వినిపించని ప్రాంతంలో.. చుట్టూ ఉన్న నీరు బతుకును బలికోరుతున్న సమయాన.. ఓ వృద్ధురాలు ప్రాణాలు కాపాడుకున్నారు. రాత్రంతా బావిలో ఉండిపోయారు. ఈ ఘటన పట్టుపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలమేరకు..
పొట్నూరు లోకేశ్వరరావు జీడి మామిడి తోటలో ఉన్న బావి వద్ద ఆదివారం సాయంత్రం చెప్పులు ఉండడాన్ని కొందరు గ్రామస్తులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా ఓ డబ్బై ఏళ్ల మహిళ బావి లోపల రాళ్లను పట్టు కుని ఓ మూలన కనిపించింది. దీంతో వారు వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు తామా డ భాస్కరరావు, ఎన్.వెంకటరావు హుటాహుటిన బావి వద్దకు వెళ్లి మెళియాపుట్టి గ్రామానికి చెందిన రేఖాన ఢిల్లి అనే వ్యక్తి సాయంతో ఆమెను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం చాపర పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పేరు లక్ష్మి అని, ఊరు శ్రీకాకుళం అని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు మతిస్థిమితం లేదని, రాత్రి బావిలో పడిపోయి ఉంటుందని స్థానికులు తెలిపారు. – మెళియాపుట్టి
● రాత్రంతా బావిలోనే..
● రాత్రంతా బావిలోనే..
● రాత్రంతా బావిలోనే..