
ఆకాశం అందుకుందాం..
టెక్కలి:
పేద విద్యార్థులు ఆకాశాన్ని అందుకోవడానికి అపూర్వ అవకాశం వచ్చింది. పైలెట్ కావాలనే ఆకాంక్ష, ఆసక్తి కలిగిన నిరుపేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమాన తయారీ సంస్థ బోయింగ్, ఢిల్లీకి చెందిన లెర్నింగ్ లింక్స్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో బోయింగ్ సుక న్య స్టెమ్ ల్యాబ్‌లను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో టెక్కలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సరుబుజ్జిలి మండలం వె న్నెలవలస జవహర్ నవోదయ పాఠశాలల్లో మాత్ర మే ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచే శిక్షణ తరగతులు ప్రారంభించారు. వీటి ద్వారా టెక్కలి బాలికోన్నత పాఠశాలలో 710 మందికి, వెన్నెలవలస నవోదయ పాఠశాలలో 465 మంది శిక్షణ అందజేస్తున్నారు. ఢిల్లీలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ‘ఫెసిలిటేటర్’తో రెండు పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు.
పైలెట్‌ల కొరత రాకుండా..
భవిష్యత్‌లో ఏవియేషన్ రంగంలో పైలెట్‌ల కొరత లేకుండా ఉండేందుకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసం ముఖ్యంగా బాలి కలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ స్టెమ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్, విభిన్నమైన ఆలో చనలు, సమస్యల పరిష్కారం, సహకారం, టీమ్ స్ఫూర్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆయా అంశాల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు. అంతే కాకుండా ఈ ల్యాబ్ ద్వారా అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్, సెన్సార్స్, సర్వో మోటార్స్, మెకానికల్, ర్యాపిడ్ ఫొటో టైపింగ్, త్రీడీ ప్రింటింగ్, ఫ్లూటో డ్రోన్స్, ట్రాన్స్‌మీటర్స్, రిసీవర్స్, ఏవియేషన్ సాంకేతిక అంశాలతో శిక్షణ ఇస్తారు.
పేద విద్యార్థులకు పైలెట్ శిక్షణ
బోయింగ్ సంస్థ, లెర్నింగ్ లింక్స్ నేతృత్వంలో బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్ నిర్వహణ
జిల్లాలో టెక్కలి, వెన్నెలవలసలో ల్యాబ్‌లు ఏర్పాటు

ఆకాశం అందుకుందాం..