ఇసుకాసురులు ఏరు వదిలి ఊరి మీద పడ్డారు. ఇసుక తవ్వకం వద్దు అన్నందుకు గ్రామస్తులను చావబాదారు. ఆ గ్రామంలోని నది వద్దకు వెళ్లి, అక్కడి ఇసుక తీసుకెళ్లి అమ్ముకుంటూ తిరిగి అదే గ్రామస్తులపై దాడికి తెగబడ్డారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మ తొర్లువాడలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఇసుక తవ్వకాల వల్ల తమకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఉదయం ఆందోళన చేస్తే.. వంద మందితో రాత్రిపూట ఊరి మీద పడి దాడి చేయడం కలకలం రేపుతోంది.
భయాందోళనలో గ్రామస్తులు
పాతనిమ్మతొర్లువాడలో అలజడి
ఆమదాలవలస:
ఆమదాలవలస మండలం నిమ్మ తొర్లువాడలో ఇసుక వ్యాపారులు రెచ్చిపోయారు. ఇక్కడ నాగావళి తీరంలో జేసీబీలతో పెద్ద పెద్ద గోతులు చేస్తూ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వేల సంఖ్యలో లారీలతో ఇసుకను తరలిస్తూ ఉంటే తమ గ్రామానికి ముప్పు కలుగుతుందని పాత నిమ్మ తొర్లువాడ గ్రామస్తులు ఆదివారం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమదాలవలస ఎస్‌ఐ ఎస్.బాలరాజుతోపాటు కొంతమంది పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని స్థానికులతో చర్చించారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులతో మాట్లాడుతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇంతలోగా సాయంత్రం కావడంతో ఇసు క ర్యాంపు నిర్వాహకులు సమీప గ్రామాల్లో ఉన్న కొంతమంది రౌడీలను ఉసిగొల్పి ర్యాంపును అడ్డుకున్న వారిపై రాత్రి దాడి చేయించారు. ఇనుప రాడ్లు, కర్రలతో దాదాపు వంద మంది ఊరి మీద పడ్డారు. ఈ దాడిలో పాత నిమ్మ తొర్లువాడ గ్రామానికి చెందిన వండాన వైకుంఠరావు, ఇప్పిలి రాజేష్, బోనెల ఈశ్వరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ, గ్రామాలపై దాడులు చేస్తున్న వారిని ఆమదాలవలస పోలీసులు చూసీచూడనట్టు వదిలేయడంపై పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పాత నిమ్మతొర్లువాడ గ్రామంలో నాగావళి తీరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు
ఇసుక ర్యాంపు వద్దు అన్నందుకు
పాత నిమ్మ తొర్లువాడ గ్రామస్తులపై దాడి
ర్యాంపు నిర్వాహకులే దాడి
చేయించారంటున్న గ్రామస్తులు
ఇనుప రాడ్లు, కర్రలతో దాడి
పోలీసుల సమక్షంలోనే కొట్టినా పట్టించుకోని వైనం
మళ్లీ మొదలెట్టారు..!ఒడిశాకు అక్రమ ఇసుక త రలి వెళ్తోంది.
మళ్లీ మొదలెట్టారు..!ఒడిశాకు అక్రమ ఇసుక త రలి వెళ్తోంది.
మళ్లీ మొదలెట్టారు..!ఒడిశాకు అక్రమ ఇసుక త రలి వెళ్తోంది.