ఎమ్మెల్యేను కలిశారా..? | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను కలిశారా..?

Jul 23 2025 5:58 AM | Updated on Jul 23 2025 5:58 AM

ఎమ్మె

ఎమ్మెల్యేను కలిశారా..?

వేధింపులు సరికాదు

సచివాలయ ఉద్యోగులపై రాజకీయ వేధింపులకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరుద్యోగులనే టార్గెట్‌ చేస్తోంది. ఇది దుర్మా ర్గమైన పద్ధతి. నిబంధనల మేరకు బదిలీలు పొందిన సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలి.

– పోలాకి ప్రసాదరావు, సీపీఎం,

జిల్లా కార్యవర్గ సభ్యుడు, శ్రీకాకుళం

పాతపట్నం నియోజకవర్గంలో వింత సంస్కృతి

సచివాలయ ఉద్యోగులతో ఎంపీడీఓల చెడుగుడు

ఎమ్మెల్యేను కలవాల్సిందేనని హుకుం

పాతపట్నం: కొత్తగా ఆఫీసులో చేరాలంటే ఎమ్మెల్యే లెటర్‌ ఉండాలి. ట్రాన్స్‌ఫర్‌ అయిన ఉద్యోగి మరోచోట జాయిన్‌ కావాలంటే ఎమ్మెల్యే ఆ ఉద్యోగి పేరు ముందుగానే చెప్పి ఉండాలి. బదిలీ తర్వాత విధుల్లో చేరాలంటే ఎమ్మెల్యేను కలిశాకే ఆఫీసుకు రావాలి.. పాతపట్నంలో అమలవుతున్న వింత సంస్కృతి ఇది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు ఎమ్మెల్యేను కలిశాకే ఏ పనైనా చేయాలని అధికారులే హుకుం జారీ చేస్తున్నారు.

తాజాగా పాతపట్నం మండలంలోని కాగువాడ సచివాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మెళియాపుట్టి మండలం మర్రిపాడు–సి, కరజాడ, కోటబొమ్మాళి మండలం కురుడు అంటూ మూడు చోట్లకు బదిలీ చేశా రు. ఆ ఉద్యోగి అక్కడ బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు. అయితే ‘ఎమ్మెల్యే నీ పేరు చెప్పలేదు. రెండు రోజులు ఆగు మాట్లాడి చెబుతా’ అనే సమాధానం ఎంపీడీఓ నోటి నుంచి వినిపించడంతో ఆ ఉద్యోగి అవాక్క య్యారు. మరో ఉద్యోగికి పాతపట్నం మండలంలోని బడ్డుమర్రి బదిలీ అయ్యింది. తీరా అక్కడకు వెళ్తే ‘నిన్ను వేరే సచివాలయానికి మార్చేశా’ అని ఎంపీడీఓ చెప్పడంతో అతను నివ్వెరబోయారు. ఇంకో ఉద్యోగికి కొత్తూరు మండలం నుంచి పాతపట్నం మండలంలో ని ఓ సచివాలయానికి బదిలీ కాగా, విధుల్లో చేరేందుకు వెళితే ఎమ్మెల్యేని కలిసి రావాలని, లేదంటే ఆయన పీఓతోనైనా ఫోన్‌ చేయించాలని సాక్షాత్తు ఎంపీడీఓ తెగేసి చెప్పేశారు. పాతపట్నంలో ఈ విష సంస్కృతికి వేళ్లూనుకుంటోంది. ప్రజా ప్రతినిధుల వేధింపులతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొత్త స్థానాల్లో విధుల్లో చేరలేక నరకం చూస్తున్నారు.

నియోజకవర్గంలోని 91 గ్రామ సచివాలయాల్లో 718 మంది ఉద్యోగులు వివిధ కేడర్‌లలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి జూ న్‌ 15 నుంచి 30వ తేదీ వరకు బదిలీల కస రత్తు నిర్వహించారు. బదిలీ అయిన వారు జూలై 10లోపు కొత్తస్థానాల్లో చేరిపోవాలి. కానీ ఇలా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా మంది ఇప్పటికీ విధుల్లో చేరలేదు. ‘ఎవరి అనుమతితో ఇక్కడకు వచ్చావు’ వంటి ప్రశ్న లు ఎదురవుతుండడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

నమస్తే పెట్టి వెళ్లు..

కొత్త స్థానాల్లో చేరేందుకు వెళ్తున్న సచివాల య ఉద్యోగులను ఎంపీడీఓలు వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు ఎమ్మెల్యేల పీఏలు కాల్‌ చేసి, ‘ఒక సారి వచ్చి ఎమ్మెల్యేకు నమస్తే పెట్టి వెళ్లు’ అంటూ ఆదే శాలు జారీ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, వారి పీఏలు, ఎంపీడీఓలు ఇలా ఎవరికి వారు సచివాలయ ఉద్యోగులతో చెడుగుడు ఆడుకుంటున్నారు.

పట్టించుకోని జిల్లా యంత్రాంగం

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను జారీచేసింది. కలెక్టర్‌ అనుమతితో నిబంధనలను అ నుసరించి బదిలీలు చేపట్టారు. ఈ ప్రక్రియ లో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఇచ్చి న సిఫార్సులు చెల్లకపోవడంతో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేను కలిశారా..? 1
1/2

ఎమ్మెల్యేను కలిశారా..?

ఎమ్మెల్యేను కలిశారా..? 2
2/2

ఎమ్మెల్యేను కలిశారా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement