
నేరాలను నియంత్రించాలి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో నేరాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని, పెండింగ్ వారెంట్లు త్వరితగతిన అమలుకు పంపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు, పరిష్కారం, మాదకద్రవ్యాల నియంత్రణ, నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ల అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విజిబుల్ పోలీసింగ్, కార్టన్ అండ్ సెర్చ్ సోదాలు వంటి అంశాలపై జిల్లాలో గల డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి మందిరాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేలా కమిటీలను సన్నద్ధం చేయాలన్నారు. వాహనాల తనిఖీలు చేపట్టి గంజాయి అక్రమ రవాణా, క్రయవిక్రయాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించాలని, సాయంత్రం విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా కళాశాలలు, పాఠశాలల పరిధిలో ఎలాంటి ర్యాగింగ్, ఇతర నేరాలు జరగకుండా చూడాలన్నారు.