
సైన్స్‌లో మరిన్ని ఆవిష్కరణలు అవసరం
శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంలో సైన్స్, సాంకేతిక రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణాలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ పి.అప్పారావు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ కణితి శ్రీరాములు అధ్యక్షతన పాపులర్ లెక్చర్ సిరీస్ పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయెటెక్నాలజీ న్యూఢిల్లీ సౌజన్యంతో అప్‌లైడ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అప్పారావు మాట్లాడుతు సైన్స్‌లో ఆవిష్కృతమయ్యే సరికొత్త వంగడాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని ఆకాంక్షించారు. మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ రాయల సురేష్‌కుమార్, కళాశాల అప్‌లైడ్ సైన్సెస్(బయోటెక్నాలజీ) విభాగాధిపతి డాక్టర్ మధమంచి ప్రదీప్, జీడీసీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు, గురజాడ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సంయుక్త తదితరులు కార్యక్రమంలో ప్రసంగించి సైన్స్ పరిశోధనలు, విజ్ఞానం, వ్యాధులపై అవగాహన కల్పించారు. పలు అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి పైడి సుధారాణి, సభ్యురాలు డాక్టర్ రోణంకి హరిత, కె.ప్రశాంతి, కె.అపర్ణ, అధ్యాపకులు, వివిధ కళాశాలల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌పై అప్రమత్తం..
క్యాన్సర్ వ్యాప్తి గురించి విద్యార్ధులు సమగ్రంగా తెలుసుకోవాలిది. వ్యాధిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తొలి దశలో క్యాన్సర్ గుర్తింపుతో కొంత నష్టనివారణ చర్యలు తీసుకోవచ్చు. ఏడాదికి కనీసం రెండుసార్లు శారీరక,ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. – ప్రొఫెసర్
రాయల సురేష్‌కుమార్, మద్రాస్ ఐఐటీ
సైన్స్‌తోనే జీవితం..
నిత్యజీవితం సైన్స్‌తోనే ముడిపడి ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైన్స్‌తోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధలు ఆవిష్కృతం కావాలి. పరిశోధనలతోనే గుర్తింపు లభిస్తుంది. విద్యార్థి దశ నుంచే పరిశోధనా రంగంపై ఆసక్తిను అలవర్చుకోవాలి. – కింతలి సూర్యచంద్రరావు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
నైపుణ్యం మెరుగు..
సదస్సులు, సెమినార్‌లతో విద్యార్థుల్లో ఆలోచన సరళి, పరిశోధనా నైపుణ్యం మరింత మెండుగా తయారవుతుంది. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఇటువంటి సదస్సులు దోహదపడతాయి. కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. – డాక్టర్ మదమంచి ప్రదీప్‌కుమార్,
బయోటెక్నాలజీ హెచ్‌ఓడీ
హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అప్పారావు
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
‘పాపులర్ లెక్చర్ సిరీస్’
తరలివచ్చిన నిష్ణాతులు, అధ్యాపకులు,
విద్యార్థులు

సైన్స్‌లో మరిన్ని ఆవిష్కరణలు అవసరం

సైన్స్‌లో మరిన్ని ఆవిష్కరణలు అవసరం

సైన్స్‌లో మరిన్ని ఆవిష్కరణలు అవసరం