
ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో విభజన తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను ఎవరి ప్రయోజనాల కోసం విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేస్తున్నారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.కృష్ణమూర్తి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలో వామపక్షాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, మహిళా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిపోను విభజిస్తే అనేక దళిత, పేద హమాలీ కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడును జిల్లా ప్రజలు శివారు భూములకు నీరు ఇమ్మని అడుగుతున్నారు తప్ప బీరు అడగడం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వామపక్ష, వివిధ సంఘాల నాయకులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, సంతోష్, ఎం.గోవర్ధనరావు, కె.సూరయ్య, ఎల్.రామప్పడు, ఎం.రమణ, పి.సుధాకర్‌బాబు, కేదారేశ్వరరావు, ఆర్.ప్రకాష్, హమాలీ యూనియన్ నాయకులు నిడిగంట్ల రమణ, గజిని శ్రీనివాసరావు, లండ సీతారాం, లింగాల రాము, శొంఠ్యాన శ్రీనివాసరావు, నవిరి సురేష్ పాల్గొన్నారు.