
మావోయిస్టు నేతకు మాతృవియోగం
వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు నేత, కేంద్ర కమిటీ సభ్యులు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ మాతృమూర్తి మెట్టూరు చినపిల్లమ్మ (92) గురువారం మృతి చెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. చినపిల్లమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మూడో సంతానం జోగారావు. చినపిల్లమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం అదే గ్రామంలో చేపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.