
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. 50 ఏళ్లకు పింఛన్ ఊసెత్తడం మానేశారు. తల్లికి వందనం ఒక ఏడాది ఎగ్గొట్టేశారు. ఇప్పుడు కూడా అనేక ఆంక్షలు పెట్టారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వాయిదాలు పడుతూనే ఉంది. అన్నదాత సుఖీభవ గత ఏడాది ఇవ్వనేలేదు. ఈ ఏడాది కూడా ఇస్తారో లేదో అన్నట్లు ఉంది. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పథకాలకు అతీగతి లేదు. ఉచిత గ్యాస్ హామీలు కూడా గాలి మాటలేనని తేలిపోయింది.
ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలట?
ఇన్ని పథకాలు అమలు చేయకపోయినా అన్నీ అమలు చేసేశామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక 19 నుంచి 60ఏళ్ల లోపు మహిళలకు నెలకి రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న హామీకి తొలి ఏడాది పంగనామం పెట్టారు. ఈ ఏడాదైనా ఇస్తారేమో అని మహిళలు అంతా ఆశతో చూస్తున్నారు. ఒక్క మన జిల్లాలోనే 7,59,692మంది మహిళలు నిరీక్షిస్తున్నారు. ఇప్పుడా ఆశలపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో నీళ్లు జల్లేసినట్టు అయిపోయింది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాల్సి వస్తుందని బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీంతో ఆడబిడ్డ నిధి పథకం లేనట్టే అని సంకేతాలు ఇచ్చినట్టయ్యింది. దీనిపై మహిళలంతా మండిపడుతున్నారు. ఏరు దాటాక తప్ప తగలేసినట్టు ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక మాట మార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రతీసారి ఇదేరకంగా మోసం చేస్తోందని అంటున్నారు.
సోషల్ మీడియోలో వైరల్
అచ్చెన్న తాజా వ్యాఖ్యలతో ఆయన పాత మాటలు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. గతంలో చేసిన కామెంట్లతో పార్టీ పరువు పోగా, ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రం అమ్మేయాలన్న వ్యాఖ్యలతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది.
‘రైతులకు ఆశ ఎక్కువ. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదు. మార్కెట్‌లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలి’. – రైతులనుద్దేశించి
అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి.
ఇవ్వకపోతే పోరాటం చేస్తాం
ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ప్రతి నెలా ఇవ్వకపోతే పోరాటం చేస్తాం. అచ్చెన్న వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి.? దీన్ని మోసం కాక ఇంకేమంటారు.? గత ఏడాది బకాయితో కలిపి మొత్తం చెల్లించాలి.
– చింతాడ రవికుమార్,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త
●
దారుణ వంచన
కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. ఇంతకంటే మోసం ఉంటుందా..? ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇలాంటి ప్రకటన చేయడం ఏంటి.? మహిళలను మోసం చేస్తున్న కూటమికి గుణపాఠం తప్పదు. వైఎస్ జగన్ చిత్తశుద్ధిగా పథకాలు అమలు చేశారు.
– రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు
హామీలు ఎందుకు ఇచ్చారు..?
ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమని తెలిసిన కూటమి పార్టీ లు ఎన్నికలకు ముందు ఎందుకు హామీ ఇచ్చాయి. మంత్రి అచ్చెన్నాయడు ఈ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అనడం సరికాదు. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా?
– పిరియా విజయ, జెడ్పీ చైర్‌పర్సన్,
ఇచ్ఛాపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
ఇవ్వలేమని తేల్చేశారు..
మంత్రి అచ్చెన్నాయుడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా ఆడబిడ్డ ఇవ్వలేమని తేల్చి చెప్పేసినట్టే. ఎన్నికల మునుపు మహిళలకు హామీలిచ్చి అధికారం దక్కించుకోవడం ఆ తర్వాత మహిళల్ని దగా చేయడం చంద్రబాబు ప్రభుత్వానికే సాధ్యం. – పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ
నియోజకవర్గ ఇన్‌చార్జి, టెక్కలి
ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
ఓట్లేసిన ప్రజలనే మోసగించారంటూ మండిపడుతున్న నెటిజన్లు
అచ్చెన్న గతంలో చేసిన
కామెంట్లను గుర్తు చేస్తున్న వైనం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్