
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం గురువారం ఉదయం ఘనంగా జరిగింది. వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్బంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీవా రి కల్యాణ మూర్తులను అనివెట్టి మండపంలో ఉంచి ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణాన్ని జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్ శర్మ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించగా, రూ.500 చెల్లించిన భక్తదంపతులు కల్యాణ సేవలో పాల్గొని స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.