
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం యలమంచిలి గ్రామానికి చెందిన బందాపు ఆనందరావు(38) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు ఆనందరావు నిత్యం మద్యం సేవిస్తుంటాడు. అతని భార్య తేజావతి రెండు రోజులు క్రితం మద్యం తాగవద్దని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన అతడు పురుగుల మందు తాగేశాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహూటిన కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కోటబొమ్మాళి పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య తేజావతితో పాటు కుమార్తెలు నాగమణి, మీనా, కుమారుడు భవానీ ప్రసాద్‌లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.