
గవర్నర్ చేతుల మీదుగా పతకాన్ని అందుకుంటున్న రుచిత
మందస: మండలంలోని హరిపురం గ్రామానికి చెందిన అడ్నాల రుచిత ఇంజినీరింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర గవర్నర్ జస్టిస్‌సయ్యద్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఇటీవల బంగారు పతకం అందుకుంది. సామాన్య కుటుంబానికి చెంది అడ్నాల దామోదరం, భారతిల కుమార్తె రుచిత జేఎన్‌టీయూ(కాకినాడ)లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ) విభాగంలో గరిష్టమార్కులు(సీజీపీ 8.66) సాధించింది. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంది.
రుచిత 10వ తరగతిలో 10పాయింట్లు సాధించగా, ఇంటర్‌మీడియట్‌లో 989/1000 మార్కులు పొందింది. ఏపీ ఎంసెట్‌లో 1137వ ర్యాంకు సాధించి జేఎన్‌టీయులో చదువుతోంది. కాగా, రుచిత ప్రస్తుతం ఎల్‌అండ్‌టీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్(తమిళనాడు)గా ఎంపికయ్యారు. భవిష్యత్‌లో సివిల్స్ సాధించడమే లక్ష్యమని రుచిత తెలిపారు.