
కొనసాగుతున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ –2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎచ్చెర్ల మండల పరిధిలో రెండు పరీక్ష కేంద్రాల్లో గురువారం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించారు. చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 279 మందికి 270, రెండో షిఫ్టులో 280 మందికి 265 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 169 మందికి 162, రెండో షిఫ్టులో 170 మందికి 164 మంది హాజరయ్యారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మానవత్వం చాటుకున్న
బ్యాంకు ఉద్యోగి
రణస్థలం: మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన బొంతు అప్పలనాయుడు అనే బ్యాంకు ఉద్యోగి మానవత్వం చాటుకున్నాడు. బుధవారం చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామదేవత పండుగకు వెళ్లిన అతనికి ఒక పర్సు దొరికింది. అందులో రూ.16,500 నగదు, ఆధార్, పాన్‌కార్డు, ఓటర్, డ్రైవింగ్ లైసెన్సు కార్డులతో పాటు వివిధ ఏటీఎంలు ఉన్నాయి. అందులో వివరాలు ప్రకారం ము ద్దాడ గోవింద అనే వ్యక్తివిగా గుర్తించి ఆయన కు సమాచారం అందించారు. అతను గురువారం రణస్థలం రావడంతో పోగొట్టుకున్న పర్సును అప్పలనాయుడు అందజేశారు. మానవత్వం చాటుకున్న బ్యాంకు ఉద్యోగి అప్పలనాయుడును స్థానికులందరూ ప్రశంసించారు.
హైదరాబాద్‌లో గూనభద్ర వాసి మృతి
కొత్తూరు: కొత్తూరు మండలం గూనభద్రకు చెందిన నక్క శ్రీనివాసరావు(41) హైదరాబాద్‌లో గురువారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయన కుటుంబంతో పాటు హైదరబాద్‌లో నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఒక ఇంటిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య కృష్ణకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసరావు మృతి చెందడంతో గూనభద్ర గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావు మృతదేహాన్ని స్వగ్రామం గూనభద్ర తీసుకు వస్తున్నారు.
చిత్రలేఖనం పోటీల్లో బ్రాహ్మణతర్లా విద్యార్థికి ప్రథమ స్థానం
పలాస: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం పురస్కరించుకొని గురువారం నిర్వహించిన రాష్ట్ర జీవ వైవిధ్య సదస్సులో పలాస మండలం బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలకు చెందిన సైన్సు ఉపాధ్యాయుడు నేషనల్ గ్రీన్ కోర్ క్లస్టర్ కోఆర్డినేటరు కొయ్యల శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో విద్యార్థులు పాల్గొన్నారు. ‘ప్రకృతితో సామరస్యం స్థిరమైన అభివృద్ధి’అనే అంశంపై చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఇంజినీరింగ్ విభాగంలో పుచ్చ అక్షర కుమార్ ప్రథమ స్థానం సాధించాడు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతులు మీదుగా ప్రశంశాపత్రం, జ్ఞాపికను అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జీవ వైవిద్య మండలి చైర్మన్ ఎన్.విజయకుమార్, మెంబర్ సెక్రటరీ పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు

కొనసాగుతున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు