సమస్యలు పరిష్కరించేదాకా పోరు | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించేదాకా పోరు

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

పుట్టపర్తి అర్బన్‌: వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలంటూ చేపట్టిన దీక్షలు శనివారం 5వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా సీహెచ్‌సీల్లో పని చేస్తున్న ఉద్యోగులు పుట్టపర్తిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద దీక్షా శిబిరంలో 5వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొందరు ఉద్యోగులు చంటి బిడ్డలతో పాటు దీక్షలో కూర్చోవడంతో అటుగా వెళ్లేవారంతా ఆడబిడ్డలకు ఎంత కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పూర్తి జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. 5 రోజులుగా ఉద్యోగులంతా సమ్మె బాట పట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించే దాకా పోరాటం కొనసాగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement