దారి దోపిడీ దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దారి దోపిడీ దొంగల అరెస్ట్‌

Jul 28 2026 1:42 AM | Updated on Jul 28 2026 1:42 AM

చందానగర్‌(హైదరాబాద్‌): దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను చందానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం రామచంద్రాపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ శ్రీధర్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. కదిరి మండలం కురుమామిడికి చెందిన ఉజర్ల విష్ణు వర్ధన్‌ నగరంలోని మంగళ్‌హట్‌ శివలాల్‌ నగర్‌లో నివాసముంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. బోడుప్పల్‌ బంగారు మైసమ్మ టెంపుల్‌లో నివాసముండే దండగుల భాను ప్రసాద్‌ ప్రస్తుతం శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీలో నివాసముంటూ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 22వ తేదీన వీరిద్దరూ కలిసి చందానగర్‌ హుడాకాలనీలోని ఓ గుడిసెలోకి వెళ్లి మంచినీళ్లు కావాలని అడిగి సెల్‌ఫోన్‌ లాక్కొని ఇంట్లో వారిపై దాడి చేసి పారిపోయారు. బాధితులు చందానగర్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించిన పోలీసులు సోమవారం పాపిరెడ్డి కాలనీలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరిపై 11 దొంగతనాల కేసులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. దారి దోపిడీలకు పాల్పడేవారని తెలిసింది. ఈ క్రమంలో నిందితుల నుంచి ఒక రెడ్‌మీ నోట్‌ 11 సెల్‌ఫోన్‌తో పాటు బజాజ్‌ పల్సర్‌ 220, బజాజ్‌ పల్సర్‌ 150, బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160, కేటీఎం డ్యూక్‌ 200, యమహా ఫ్యాసినో బైకులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement