చెట్లకు నిప్పు .. పర్యావరణానికి పెనుముప్పు | - | Sakshi
Sakshi News home page

చెట్లకు నిప్పు .. పర్యావరణానికి పెనుముప్పు

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

వజ్రకరూరు: మండల కేంద్రమైన వజ్రకరూరు సమీపంలోని ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారు. దీంతో పచ్చని చెట్లు కాలిపోతున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లకు కావాలనే నిప్పు పెడుతున్నారా, లేక ఇతర కారణాల వల్ల నిప్పు పెడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి ఉరవకొండ – గుంతకల్లు ప్రధాన రహదారిలో ఉన్న చెట్లను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement