యువతలో చైతన్యం రావాలి | - | Sakshi
Sakshi News home page

యువతలో చైతన్యం రావాలి

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

ప్రశాంతి నిలయం: ఆధునిక యువత భారతీయ సంస్కృతీ ఆధ్యాత్మికతపై చైతన్యం పెంపొందించుకొని సమ సమాజస్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు పిలుపునిచ్చారు. ఏటా సత్యసాయి విద్యాంస్థల విద్యార్థులకు భారతీయ సంస్కృతీ ఆధ్యాత్మికతపై అవగాహన పెంపొందించడానికి నిర్వహించే వేసవి శిక్షణా తరగతులను ఆదివారం ప్రారంభించారు. పూర్ణ చంద్ర ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ఆర్‌జే రత్నాకర్‌రాజు, ట్రస్ట్‌ సభ్యులు సత్యసాయి యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రాఘవేంద్రప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సంస్కృతీ సాంప్రదాయాలను ఆచరిస్తూ తర్వాతి తరానికి వాటిని అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. ఆధ్యాత్మికత, మానవతా విలువలు పాటించడం యుక్తవయస్సు నుంచే అలవర్చుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించే వేసవి శిక్షణ తరగతులు సోమ, మంగళవారం ప్రశాంతి నిలయంలో జరగనున్నాయి.

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోండి

యువత నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని సమాజాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆర్‌జే రత్నాకర్‌ రాజు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సాయికుల్వంత సభా మందిరంలో గ్లోబల్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ‘స్వీయ పరివర్తన కోసం నాయకత్వ లక్షణాలు’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి ఇ–సేవా సంస్థలు నిర్వహించిన కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం భారతీయ పౌరాణిక ఇతిహాసాల నుంచి ధర్మసారాలను బోధించే పలు ఘట్టాలను ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement