మడకశిర: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ.24 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో తాగునీటి సమస్యలు, ఎల్‌నినో ప్రభావంపై అనుసరించాల్సిన చర్యల గురించి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలోని 600పైగా గ్రామాల్లోని ఓహెచ్‌ఎస్‌ఆర్, జీఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాగునీటి పథకాల పైప్‌లైన్ లీకేజీలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నీటి ప్రవాహం తగ్గినా, పూడిక చేరినా, తక్షణమే బోరు బావులను ఫ్లషింగ్ చేయాలని ఆదేశించారు. తాగునీటి పథకాలకు సంబంధించిన మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మురళీధర్, డీపీఓ సమత, పట్టు పరిశ్రమ శాఖ జేడీ శోభారాణి, డీఏఓ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్ వెల్లడి


