నేడు విద్యా సంస్థల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యా సంస్థల బంద్‌

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

పుట్టపర్తి టౌన్‌: విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గురువారం పుట్టపర్తి పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులు విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న నీట్‌ వంటి జాతీయస్థాయి పరీక్షలో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. నీటి పేపర్‌ లీకేజీలకు భాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపిచ్చామన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పోతులయ్య, నిరంజన్‌యాదవ్‌, పవన్‌కుమార్‌, బండి శివ తదితరులు పాల్గొన్నారు.

సోషల్‌ మీడియా పోస్ట్‌ కేసులో యువకుడికి బెయిల్‌

చిలమత్తూరు: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుపై సోషిల్‌ మీడియాలో పోస్టు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన వీర ప్రతాప్‌రెడ్డికి హిందూపురం స్పెషల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మడకశిరకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి హిందూపురంలోని స్పెషల్‌ కోర్టులో హాజరుపరిచారు. బాధితుడికి వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక అండగా నిలిచారు. ఆమె సూచన మేరకు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు వెంకటరెడ్డి బాధితుడి తరుఫున వాదనలు వినిపించారు. ఈ మేరకు న్యాయమూర్తి బాధితుడి సొంత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. కాగా బెయిల్‌ మంజూరు అయిన తర్వాత కూడా మడకశిర పోలీసులు బాధితుడిని పోలీసు జీపులో తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే బాధితుడిని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్‌ దీపిక డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement