చంద్రబాబుకు ఎమ్మెల్యే గుమ్మనూరు ఝలక్‌ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఎమ్మెల్యే గుమ్మనూరు ఝలక్‌

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

శిలఫకంలో సీఎం పేరు గల్లంతు

గుంతకల్లు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసి పెద్ద ఝలక్‌ ఇచ్చారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. వివరాలు.. స్థానిక భాగ్యనగర్‌లోని ఎస్‌జేపీ హైస్కూల్‌ సమీపంలో డీఎంఎఫ్‌ నిధులు దాదపు రూ.50 లక్షలతో ఉర్దూ హైస్కూల్‌ను ఆధునికీకరణ చేశారు. గురువారం జరిగిన భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే స్టేజ్‌పై వెనుకల ఏర్పాటు చేసిన భారీ బ్యానర్‌లో కానీ, శిలాఫలకం మీద కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఎక్కడా కనపడలేదు. స్టేజ్‌పై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో కేవలం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి చిత్రాలు మాత్రమే దర్శనమిచ్చాయి. శిలాఫలకంలో జయరాం చిత్రపటంతో పాటు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తదితరుల పేర్లు ఉన్నాయిగాని సీఎం చంద్రబాబు పేరు మాత్రం గల్లంతవడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement