గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా 10 వేల రూపాయలు బ్యాంక్ ద్వారా వడ్డీ లేని రుణాన్ని అందించేది. మాలాంటి చిరు వ్యాపారులకు అది ఎంతగానే ఉపయోగపడేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఆర్థిక భరోసా కరువైంది. పెట్టుబడికి ప్రైవేటు వ్యాపారులపై ఆధార పడాల్సి వస్తోంది. వచ్చిన డబ్బంతా వడ్డీకే పోతే ఎలా బతకాలి?
– హైదర్‌వలి, చిరు వ్యాపారి, పుట్టపర్తి
హామీలు నీట మీద రాతలే..
ఎన్నికల సమయంలో కూటమి నాయకులు గత ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు ఏమి పథకాలు అమలు చేశారో, అలాగే ఆదుకుంటామని గొప్పగా హామీలు ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న చిరు వ్యాపారులను పట్టించుకొన్న పాపాన పోలేదు. వారిచ్చిన హామీలన్నీ నీతి మీద రాతలుగానే మిగిలిపోయాయి.
– మనోహర్, చిరు వ్యాపారి, ప్రశాంతి గ్రామం


