గత ప్రభుత్వంలో జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా ఏటా పది వేల రూపాయలు బ్యాంక్ ద్వారా రుణం అందించేవారు. ప్రభుత్వం అందించిన పెట్టుబడితో వ్యాపారాలు చేసి బ్యాంక్ కంతులు చెల్లించి ఉన్న సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. అన్నిరకాల వస్తువుల ధరలు పెరగడంతో పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నాము. వ్యాపారాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. పెట్టుబడి, వడ్డీలు పోయి కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆదుకోవాలి.
– బాబా, చిరు వ్యాపారి, కదిరి


