అలంకరణలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి
ధర్మవరం అర్బన్: ఇస్కాన్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి బలిజ కళ్యాణ మండపం వరకు ప్రత్యేక రథంపై జగన్నాథస్వామి, బలరాముడు, సుభద్రాదేవి ఉత్సవమూర్తులను అలంకరించి పురవీధుల్లో రథయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని జగన్నాథుడిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రథయాత్రలో ఇస్కాన్ ప్రతినిధులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.


