లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ | - | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

లేపాక్షి: మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రజా ఆరోగ్య, పురపాలక ఇంజినీరింగ్‌శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.ప్రభాకర్‌రావు, పబ్లిక్‌ హెల్త్‌, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ సూపరింటెండెంట్‌ నాగేష్‌బాబు సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా అర్చకులను అడిగి ఆలయ విశిష్టతను తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. వారి వెంట అనంతపురం ప్రజారోగ్య, పురపాలక ఇంజినీరింగ్‌ సూపరింటెండెంట్‌ రామమోహన్‌రెడ్డి, హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, మున్సిపల్‌ ఇంజినీర్‌ గంగప్ప, డిప్యూటీ ఇంజినీర్లు మదన్‌మోహన్‌, లోకేశ్వరరెడ్డి, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ జనార్దన్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement