ప్రశాంతినిలయం: పౌరాణిక ఘట్టాలను కళ్లకు కడుతూ భక్త కోటిని మంత్రముగ్దులను చేసే నాట్య భంగిమలతో బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. తమిళనాడు భక్తుల పర్తియాత్ర ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకల్లో భాగంగా ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో అంతరంగ సాయి పేరుతో మహిళా భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. భక్తి గీతాలతో సత్యసాయిని కీర్తించారు. తమిళనాడులో పలు భజన మండళ్లను, స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. సాయంత్రం చైన్నెకి చెందిన బాలవికాస్ చిన్నారులు శివశక్తి స్వరూపం పేరుతో శివపార్వతుల లీలా విశిష్టత, వినాయకుడి వైభవాన్ని వివరిస్తూ నృత్య రూపకాలను ప్రదర్శించారు.


