అయ్యో రామా.. ప్రజాధనానికి ‘పచ్చని’ పేర్లా..! | - | Sakshi
Sakshi News home page

అయ్యో రామా.. ప్రజాధనానికి ‘పచ్చని’ పేర్లా..!

Jul 18 2026 9:45 AM | Updated on Jul 18 2026 9:45 AM

రాప్తాడు నియోజకవర్గంలో అధికార టీడీపీ పచ్చ నేతల పైత్యం కరెంట్‌ స్తంభాలపైకెక్కుతోంది. మండలంలోని బాలేపాళ్యంలో టీడీపీ నాయకులు కరెంట్‌ స్తంభాలకు ఆ పార్టీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌, ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్లు రాయించుకుంటున్నారు. విద్యుత్‌ శాఖ ద్వారా రూ.లక్షలు వెచ్చించి ఈ మధ్యనే గ్రామంలో ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం కింద కొత్తగా విద్యుత్‌ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేశారు. ఈ స్థంభాలపై అధికారులు ఇంకా విద్యుత్‌ సర్వీసులు, మీటర్ల నంబర్లు కూడా సరిగా వేయకనే స్థానిక టీడీపీ నాయకులు వాటికి పచ్చ రంగులు వేసి వారి పార్టీ నేతల పేర్లు రాసుకుంటున్నారు. దీనిపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన స్తంభాలపై రాజకీయ పార్టీ నేత పేర్లు రాసుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. – కనగానపల్లి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement