కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లా హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు హ్యాండ్ బాల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్‌కుమార్, మహేష్ తెలిపారు. జిల్లా జట్లు 18, 19వ తేదీల్లో నెల్లురులో జరిగే 5వ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యులు దానమయ్య, పీడీ యశోదలు పాల్గొన్నారు.
సీనియర్ పురుషుల జట్టు
డేనియర్, భరత్, యాసిర్, సిద్ధికీ, సాధిక్, సాయికుమార్, విశ్వనాథ్, కుమార్, నారాయణ, వరుణ్‌తేజ్, మోహిత్‌రెడ్డి, అరుణ్, ప్రవీణ్‌నాయక్, జోషినాయక్, మహేష్, శిశ, నాగారాజు, చంద్ర, సిద్ధార్థ
సీనియర్ మహిళా జట్టు
నక్షత్ర, మాధవి, సమీరా, స్వప్న, ఆదర్శిని, రిహాన, ఓంశ్రీ ప్రియాంక, ఫర్హాణా, విష్ణుప్రియా, జయదీపిక, సాయిప్రసన్న, నిహారిక, పవిత్ర, హర్షిణి, వినీత, జోష్ణ, జలజ, దివ్య, యశ్విని, హర్షిత, పవిత్ర


