కదిరి అర్బన్: మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం జరిగిన 4వ ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలుర, బాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ గోల్‌షాట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో తిరుపతి, గుంటూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో తిరుపతి జట్టు, ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జట్టు, తృతీయ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో గుంటూరు జట్టు, ద్వితీయ స్థానం శ్రీసత్యసాయి జట్టు, తృతీయస్థానం విశాఖపట్నం జట్లు నిలిచాయి. విజేతలకు ఎంఈఓ చెన్నక్రిష్ణ ట్రోఫీలు, ప్రశంశాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గోల్‌షాట్ బాల్ వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దేవిప్రియా, ప్రతినిధులు ప్రసన్నకుమార్, రామాంజులురెడ్డి, జగదీష్, డేనియల్‌తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.


