పుట్టపర్తి టౌన్: ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్‌శాఖ ప్రతిష్ట పెంచాలని హోంగార్డులకు రాయలసీమ రీజియన్ ఇన్‌చార్జ్ హోంగార్డుల కమాండెంట్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో బుదవారం నిర్వహించిన హోంగార్డుల ఒక రోజు పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. హోంగార్డుల విధులు సవాళ్లతో కూడుకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అనంతరం త్వరలో తమిళనాడులో జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే హోంగార్డులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను ఎస్పీ సతీష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ వలి, ఆర్‌ఎస్‌ఐ ప్రదీప్‌సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.
రాయలసీమ రీజియన్ ఇన్‌చార్జ్ హోంగార్డుల కమాండెంట్ మహేష్ కుమార్


