కదిరి అర్బన్: ఇటీవల ఆధునీకరించిన కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సతీష్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం ప్రారంభించారు. అలాగే పీఎస్ బయట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సైతం వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నిరంజన్‌రెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆటోను ఢీకొన్న బొలెరో
రామగిరి: ఆటోను బొలెరో ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు.. స్థానికులు తెలిపిన మేరకు.. బుధవారం రామగిరి ప్రాంతంలో కూలి పనులకు హాజరైన చెన్నేకొత్తపల్లి వాసులు రాత్రి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఎదురుగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


