మడకశిరకు చేరుకున్న బైక్‌ యాత్ర | - | Sakshi
Sakshi News home page

మడకశిరకు చేరుకున్న బైక్‌ యాత్ర

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

మడకశిర: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలనపై ప్రజలను చైతన్య పరుస్తూ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన అడవికోటి రాజు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బైక్‌యాత్ర బుధవారం మడకశిరకు చేరుకుంది. పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు వైసీ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. ఈ సందర్భంగా వైసీ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ 175 నియోజకవర్గాల్లో బైక్‌ యాత్ర సాగిస్తుండడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల మాజీ కన్వీనర్‌ రామిరెడ్డి, టౌన్‌ కన్వీనర్‌ ఓంకుమార్‌, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామి, స్థానిక నాయకులు వైసీ బాలకృష్ణారెడ్డి, సీనియర్‌ నాయకుడు లక్ష్మీనారాయణ, పాపసానిపల్లి వేమారెడ్డి, పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుడిబండ: అడవికోటి రాజు చేపట్టిన బైక్‌యాత్ర బుధవారం గుడిబండకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్పతో పాటు పలువురు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement