కదిరి టౌన్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రజానేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నీకెక్కడిదంటూ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ను వైఎస్సార్‌సీపీ కదిరి సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.100 కోట్లతో పారన్నపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీటిని కదిరికి అందించిన ఘనత వైఎస్ కుటుంబానిదేనన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే కందికుంట తాగుతున్న నీరు వైఎస్సార్ చలువతో సాధ్యపడిందేనని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లవుతున్నా కదిరి ప్రాంత అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. ఈ విషయంగా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. స్థాయి మర్చిపోయి విమర్శలు చేస్తే సహించబోమన్నారు. వైఎస్సార్ అంటే గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీ,, జలయజ్ఞం, రుణమాపీ అని, వైఎస్ జగన్ అంటే గుర్తుకు వచ్చేవి నాడు నేడు, అమ్మఒడి, రైతు భరోసా ఇంకా ఎన్నెన్నో పథకాలు ఉన్నాయన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు సొంతంగా అమలు చేసిన పథకం ఒక్కటి కూడా లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దిగుజారుడు మాటలు మాని సభ్యత కలిగిన అసెంబ్లీ సభ్యుడిగా ఉండాలని హితువు పలికారు.
వైఎస్సార్‌సీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్


