పుట్టపర్తి అర్బన్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. దశల వారీ ఆందోళనలో భాగంగా మంగళవారం జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మరోసారి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్‌కు మార్చాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, మే నెలంతా వేసవి సెలవులు మంజూరు చేయాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు సుజాత, నాగమణి, మంజుల, షర్మిల, భగవతి తదితరులు పాల్గొన్నారు.
నిరసన తెలియజేసిన అంగన్‌వాడీలు


