నా భర్త మరణించి రెండేళ్లు కావస్తోంది. అయితే వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు నేటికీ అవకాశం లభించలేదు. అధికారులను అడిగితే వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, పాలకులు స్పందించాలి. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. – జయలక్ష్మమ్మ,
రామగిరి గ్రామం, మడకశిర మండలం
మాట నిలబెట్టుకోవాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ మంజూరు చేయాలి. ప్రస్తుతం నా వయసు 55 సంవత్సరాలు. నేను బీసీ కులానికి చెందిన వ్యక్తి. చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ వస్తుందని ఆశించా. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు.
– సూర్యశేఖర్, చిన్నపల్లోళ్లపల్లి,
నల్లచెరువు మండలం


