టీఏ బిల్లుల అవినీతిలో ఉద్యోగి సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టీఏ బిల్లుల అవినీతిలో ఉద్యోగి సస్పెన్షన్‌

Mar 28 2026 7:31 AM | Updated on Mar 28 2026 7:31 AM

న్యూస్‌రీల్‌

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీస్‌శాఖలో టీఏ బిల్లులకు సంబంధించి జరిగిన అవినీతి వ్యవహారంలో డీపీఓలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ ఎస్‌.విశ్వతేజ సస్పెండ్‌ అయ్యారు. ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2022 నుంచి 2025 జనవరి 26 వరకు టీఏ బిల్లుల్లో అవకతవకలు జరిగాయని, నాలుగురోజుల క్రితం ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. విచారణలో 2022–2026 మధ్య కాలంలో విశ్వతేజ సుమారు రూ 8.9 లక్షలను అక్రమంగా తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించామని తెలిపారు. జిల్లా పోలీస్‌శాఖలో అవినీతి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement