జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. రాజారామ్ అంటూ భక్తులు శ్రీరాముడి నామస్మరణలో మునిగితేలారు. జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే శ్రీరామ, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో సీతారామ కల్యాణాలను జరిపించారు. ఆయా ప్రాంతాల్లోని భక్తులు కల్యాణోత్సవాలను చూసి తరించారు. అలాగే ఊరూరా పెద్ద ఎత్తున పానకాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వేళ ఉట్ల పరుషలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి.
– సాక్షి బృందం, శ్రీసత్యసాయి జిల్లా


